స్టూడియోలు నిర్మించాలని కోరాం: తెలుగు నిర్మాతల మండలి

ABN, Publish Date - Mar 22 , 2025 | 02:02 AM

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించినందుకు తెలుగు నిర్మాతలమండలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

Cinema News : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించినందుకు తెలుగు నిర్మాతలమండలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, దుర్గేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించామనీ, వైజాగ్‌, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోల నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల గృహనిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలు పంపామని నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


అలాగే నంది అవార్డులను పునరుద్దరించాలనీ, పెండింగ్‌లో ఉన్న అవార్డులను కూడా ఇవ్వాలని అభ్యర్ధించినట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ది కోసం ప్రభుత్వానికి పూర్తి సహకారం, మద్దతు అందిస్తామని కూడా ప్రసన్నకుమార్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో త్వరిత చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Mar 22 , 2025 | 02:06 AM