Mutyala Subbaiah: ఓటీటీలో తల్లి మనసు

ABN, Publish Date - Apr 10 , 2025 | 06:33 PM

తల్లి ప్రేమ కు ఏదీ సాటిరాదు. ఆమె మనసంతా బిడ్డల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అలాంటి ఓ తల్లి తపన, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ రూపుదిద్దుకున్న 'తల్లి మనసు' ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య (Mutyala Subbaiah) సమర్పణలో ఆయన కుమారుడు అనంత కిశోర్ నిర్మించిన సినిమా 'తల్లి మనసు' (Talli Manasu). ఈ యేడాది జనవరి 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది. రచిత మహాలక్ష్మి (Rachitha Mahalakshmi), కమల్ కామరాజు (Kamal Kamaraj), సాత్విక్, సాహిత్య ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ముత్యాల సుబ్బయ్య దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వి. శ్రీనివాస్ (సిప్పీ) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.


ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా నిర్మాత అనంత కిశోర్ మాట్లాడుతూ, ''థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 14 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. సో... ఇప్పుడీ సినిమా మరింతగా కుటుంబ ప్రేక్షకులకు చేరువ అవుతుందనే నమ్మకం ఉంది. మేం ఏ లక్ష్యంతో అయితే సినిమాను తీశామో అది నెరవేరబోతోంది'' అని అన్నారు. చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, 'చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామని ప్రేక్షకులు చెప్పడం తమ యూనిట్ కు ఎంతో ఆనందాన్నికలిగించిందని, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారం ద్వారా మిగతా ప్రేక్షకులకు దగ్గర కాబోతోంద'ని చెప్పారు.

Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ

Also Read: JAAT Review: జాట్ రివ్యూ

Also Read: Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 10 , 2025 | 06:37 PM