Sriram International: ఇద్దరు తెలుగు దర్శకులకు నాలుగు అవార్డులు

ABN, Publish Date - Apr 08 , 2025 | 03:48 PM

యానిమేషన్ ఫిల్మ్ మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య కాశీ భార్గవ్ రూపొందించిన 'శ్రీమాన్ రామ' అయోధ్యలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డులకు ఎంపికైంది.

అయోధ్య (Ayodhya) లోని శ్రీరామ్ ఇంటర్నేషనల్ సంస్థ గత మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ యేడాది ఈ సంస్థ నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు దర్శకులు రూపొందించిన చిత్రాలకు నాలుగు కేటగిరిల్లో అవార్డులు లభించాయి. తొలి తెలుగు యానిమేషన్ మూవీ 'కిట్టు' (Kittu) ను రూపొందించిన సత్య కాశీభార్గవ్ (Satya Kasi Bhargav) 'శ్రీమాన్ రామ' (Srimaan Rama) పేరుతో యానిమేషన్ సీరిస్ ను రూపొందించారు. ఇది దూరదర్శన్ నేషనల్ టీవీ లో 2024 నుండి ప్రసారం అవుతూ ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతోంది. యానిమేషన్ విభాగంలో సత్య కాశీ భార్గవ్ 'శ్రీమాన్ రామ' చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. అలానే 'శ్రీమాన్ రామ' బెస్ట్ కార్టూన్ యానిమేషన్ ఫిల్మ్ గా అవార్డును దక్కించుకుంది.


కృష్ణ ఎస్ రామ 'రామ అయోధ్య' (Rama Ayodhya) అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటర్ 2024 ఏప్రిల్ 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ గా కృష్ణ ఎస్. రామ ఎంపికయ్యారు. 'రామ అయోధ్య' చిత్రానికి గానూ బెస్ట్ కల్చరల్ స్టోరీ కాన్సెప్ట్ విభాగంలో సత్య కాశీ భార్గవ మరొక అవార్డును గెలుచుకున్నారు. తమ కృషికి తగిన ప్రతిఫలం ఈ చిత్రాలకు లభిస్తున్న ఆదరణ ద్వారా దక్కిందని, ఇప్పుడు అవార్డులూ రావడం ఆనందంగా ఉందని, ఇది తెలుగు చిత్రసీమకు గర్వకారణమని సత్య కాశీ భార్గవ తెలిపారు.

Also Read: Vishwambhara: రిలీజ్ సెంటిమెంట్ రిపీట్!?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 08 , 2025 | 03:48 PM