Sree Vishnu New Movie Song: సిరాకైంది సింగిల్ బతుకు
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:41 AM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'సింగిల్' చిత్రంలోని ‘సిరాకైంది సింగిల్ బతుకు..’ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు
శ్రీవిష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సింగిల్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘సిరాకైంది సింగిల్ బతుకు..’అనే పాటను మేకర్స్ గురువారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.