Tollywood: దత్ సిస్టర్స్ మల్టీస్టారర్
ABN, Publish Date - Apr 24 , 2025 | 02:58 PM
ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంక దత్ యంగ్ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ నిర్మించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). రిజల్ట్స్ తో పని లేకుండా కొత్త తరహా సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ విజయాలు... ఎక్కువగా అపజయాలు చూస్తున్నారు. అయినా పంథా మార్చకోకుండానే వెళుతున్నారు. పైగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి... సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని హీరోలుగా అవకాశాలను అందించుకుంటున్నారు. తాజాగా ఈ హీరోలపై లేడీ ప్రొడ్యూసర్స్ కన్నుపడింది.
డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సిద్దు జొన్నలగడ్డ. దీనికంటే ముందు కొన్ని సినిమాలు చేశాడు కానీ వాటితో ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ కాలేదు. బట్ డీజే టీల్లు మాత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాదు అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ హీరో వాటిని అవకాశాలుగా మలుచుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. రీసెంట్ గా సిద్ధు నటించిన జాక్ (Jack) బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక చేసేది ఏమీ లేక చేతిలో ఉన్న ప్రాజెక్టులపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సిద్థు... నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' సినిమాలో చేస్తున్నాడు. సేమ్ ఇలాంటి సిట్యూవేషన్ లోనే ఉన్నాడు విశ్వక్ సేన్. ఆ మధ్య లైలా (Laila) అంటూ వచ్చిన ఆకట్టుకోలేకపోయాడు. అయినప్పటికి క్రేజీ ప్రాజెక్టులను లైన్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. అయితే ఈఇద్దరి హీరోలతో సినిమా తీసేందుకు లేడీ ప్రొడ్యూసర్ల రెడీగా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
స్వప్న దత్ (Swapna dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ఈ ఇద్దరి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన మార్క్ ను చూపుకుంటున్నారు. భారీ ప్రాజెక్ట్ తో పాటు సరికొత్త కంటెంట్ తో దూకుడు చూపిస్తున్నారు. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీలతో జోరు మీదున్నారు. ఇప్పటికే మహానటి (Mahaanati), జాతి రత్నాలు (Jaathi Ratnalu), కల్కి 2898 ఎ.డి. (Kalki 2898 ఎ.డి.) వంటి సూపర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ ఇద్దరి కన్ను ఇప్పుడు విశ్వక్, సిద్దుపై పడిందట. ఈ యంగ్ స్టార్స్ తో ఓ మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరి ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశారట. స్టోరీ లాక్ అవ్వడంతో పాటు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరీ ఈ యంగ్ క్రేజీ హీరోలు తమ నటనతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read: Imanvi: అసత్యాల ప్రచారం ఆపండి...
Also Read: Tollywood: వీకెండ్ పదకొండు తెలుగు సినిమాలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి