దృశ్యకావ్యంలా షణ్ముఖ

ABN, Publish Date - Mar 12 , 2025 | 05:35 AM

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తూ, తులసీరామ్‌ సాప్పని, రమేశ్‌ యాదవ్‌తో కలసి నిర్మించారు...

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తూ, తులసీరామ్‌ సాప్పని, రమేశ్‌ యాదవ్‌తో కలసి నిర్మించారు. ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా విజయంపై నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘ఇందులో శక్తిమంతమైన పోలీస్‌ పాత్రలో ఆది కనిపిస్తాడు. ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని కొత్త పాయింట్‌తో దృశ్యకావ్యంలా ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శక నిర్మాత షణ్ముగం సాప్పని అన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:35 AM