మండు వేసవిలో చల్లని సినిమా

ABN, Publish Date - Apr 17 , 2025 | 02:31 AM

ప్రియదర్శి, రూప కొడవాయూర్‌ జంటగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు....

ప్రియదర్శి, రూప కొడవాయూర్‌ జంటగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు. వీకే.నరేశ్‌, వెన్నెల కిశోర్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది. బుధవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ ‘‘ఇదో విభిన్న తరహా కామెడీ క్రైమ్‌ చిత్రం. అన్ని రకాలుగా మెప్పిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇంటిల్లిపాదీ కలసి చూసేందుకు ఓ మంచి చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం. సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ చెప్పారు. ‘‘మండు వేసవిలో చల్లటి అనుభూతినిచ్చే సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని హీరో ప్రియదర్శి తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 02:32 AM