Tollywood: భైరవిగా సంయుక్త...
ABN, Publish Date - Apr 07 , 2025 | 04:19 PM
సంయుక్త తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టి, రాజేశ్ దండాతో కలిసి ఓ ఫిమేల్ సెంట్రిక్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తోంది. దీనికి 'భైరవి లేదా రాక్షసి' అనే పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారు.
మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త (Samyuktha) ప్రస్తుతం తెలుగులో పలు ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన 'అఖండ -2' (Akhanda -2)లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలానే నిఖిల్ (Nikhil) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ'లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సంయుక్త హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంది. అలానే శర్వానంద్ (Sarwanand) మూవీ 'నారీ నారీ నడుమ మురారి'లో హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ సినిమాలోని పాట ఒకటి విడుదలైంది. అలానే ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ పైనా సంయుక్త దృష్టి పెట్టింది. ప్రముఖ నిర్మాత రాజేశ్ దండా (Rajesh Danda) నిర్మాతగా ఆమె ఓ సినిమాను చేస్తోంది.
విశేషం ఏమంటే... ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ''ఒక రాజు ఒక రాణి, చింతకాయల రవి, జాదుగాడు'' చిత్రాలను రూపొందించిన దర్శకుడు యోగి మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం మెగా ఫోన్ చేపట్టాడు. అయితే... తన పూర్తి పేరు యోగేశ్ కెఎంసి అని టైటిల్స్ కార్డ్స్ లో వేసుకోబోతున్నాడు. గత యేడాది పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రానికి 'భైరవి' అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. లేదంటే 'రాక్షసి' అనే పేరు పెట్టాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం తాను ఐదు సినిమాల్లో నటిస్తున్నా... ఈ కథ నచ్చి డేట్స్ ను కేటాయించానని, అలానే తొలిసారి తాను నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నానని సంయుక్త తెలిపింది. మరి ఈ ఫిమేట్ సెంట్రిక్ మూవీ ఆమెకు ఎలాంటి పేరును, ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: Sumanth Prabhas: గోదారి గట్టుపైన.... సుమంత్ ప్రభాస్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి