Samantha: సమంత శుభం పలికేది ఎప్పుడంటే...
ABN, Publish Date - Apr 18 , 2025 | 03:57 PM
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన 'శుభం' చిత్రం వేసవి కానుకగా మే 9న జనం ముందుకు రాబోతోంది.
సమంత (Samantha) నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’ (Subham). కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ, ఉత్కంఠతకు లోను చేసే సన్నివేశాలతో తెరకెక్కింది. హర్షిత్ రెడ్డి (Harshith Reddy), గవిరెడ్డి శ్రీనివాస్ (Gavireddy Srinivas), చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. వసంత్ మారిగంటి కథను అందించిన ఈ సినిమాను ప్రవీణ్ కండ్రెగుల తెరకెక్కించాడు. ప్రతిభావంతులైన నటీనటులు పాత్రలకు జీవం పోశారని, అన్ని వర్గాలను అలరించే థ్రిల్లింగ్ సీన్స్ ఇందులో ఉన్నాయని, వేసవిలో ఈ సినిమా వినోదాల జల్లు కురిపిస్తుందని సమంత తెలిపింది. ఇప్పటికే విడుదలైన 'శుభం' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 9వ తేదీ విడుదల చేయబోతున్నట్టు సమంత తెలిపింది. 'శుభం' చిత్రానికి వివేక్ సాగర్ (Vivek Sagar) నేపథ్య సంగీతం అందించాడు.
Also Read: Kalyan Ram: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ
Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ
Also Read: Madhuram movie : మధురం సినిమా రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి