సాయి తేజ్‌ సాహసాలు!

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:14 AM

సాయి దుర్గతేజ్‌ కంప్లీట్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ ‘సంబరాల ఏటిగట్ట్టు’

సాయి దుర్గతేజ్‌ కంప్లీట్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ పాత్రలో నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్ట్టు’ చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఇటీవలే రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్‌ను ఓ భారీ సెట్‌లో చిత్రీకరించారు. చాలా రిస్క్‌తో కూడుకున్న ఈ ఫైట్‌లో సాయి దుర్గ తేజ్‌ పాల్గొని అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేశారు. ప్రస్తుతం దినేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ పాటను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. వెయ్యి మంది డ్యాన్సర్లు ఇందులో పాల్గొనడం ఓ విశేషం. ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో చిత్రీకరించిన పాటల్లో ఇదొకటి. రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘హను-మాన్‌’ చిత్రం తర్వాత కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్‌ దర్శకుడు. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్‌, శ్రీకాంత్‌, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య తారాగణం.

Updated Date - Mar 06 , 2025 | 05:14 AM