గ్రామీణ ప్రేమకథ

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:39 AM

హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆదివారం షూటింగ్‌ మొదలైంది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో టీఎస్సార్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని...

హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆదివారం షూటింగ్‌ మొదలైంది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో టీఎస్సార్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరగే కథతో తెరకెక్కుతోన్న చిత్రమిదని దర్శకుడు చెప్పారు. గౌతమ్‌ రవిరావు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: విపిన్‌ వి రావు.

Updated Date - Apr 28 , 2025 | 12:39 AM