Rice Mill: గ్రామాలే దేశానికి వెన్నెముక..  

ABN, Publish Date - Mar 15 , 2025 | 07:55 PM

లౌక్య, మేఘన, హరీష్‌, కార్తిక్‌, వరుణ్‌, కేశవ, దిల్‌ రమేష్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రైస్‌ మిల్‌’


లౌక్య(loujya), మేఘన(meghana), హరీష్‌, కార్తిక్‌, వరుణ్‌, కేశవ, దిల్‌ రమేష్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రైస్‌ మిల్‌’ (Rice mill). యూత్‌ ఫుల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.  సి.ఎం.మహేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎమ్‌.వంశీధర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ సాయి నిర్మిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్‌తో రైస్‌ మిల్‌ చిత్రం తెరకెక్కుతోంది. కేవలం 21 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. హైదరాబాద్‌, చుట్టు పక్కల గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్‌ చేశాం. ఉగాది సందర్భంగా సాంగ్స్‌ విడుదల చేస్తాం. ఇందులో 5 బ్యూటిఫుల్‌ సాంగ్స్‌ ఉన్నాయి. ఈ వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఈ సినిమాకు సంగితం సతీష్‌ సాధన్‌, సినిమాటోగ్రఫీ ఈదర ప్రసాద్‌, ఎడిటర్‌ అనుగోజు రేణుకా బాబు.

Updated Date - Mar 15 , 2025 | 07:55 PM