మాస్‌ లుక్‌లో...

ABN, Publish Date - Mar 28 , 2025 | 02:29 AM

రామ్‌చరణ్‌ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గురువారం రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులను ఖుషీ చేశారు మేకర్స్‌. సినిమాకు ‘పెద్ది’ అనే...

రామ్‌చరణ్‌ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గురువారం రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులను ఖుషీ చేశారు మేకర్స్‌. సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, రామ్‌చరణ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. గుబురు గడ్డంతో చుట్ట వెలిగిస్తూ మాస్‌ లుక్‌లో కనిపించారు. ఈ లుక్‌ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ సంస్థలు మైత్రీమూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకటసతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

రామ్‌చరణ్‌కు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు చరణ్‌. ‘పెద్ది’లో నీ లుక్‌ అదిరిపోయింది. నీలోని నటుడిని ఈ సినిమా మరింత కొత్తగా చూపించనుందనే నమ్మకం ఉంది. సినీ ప్రియులకు కన్నుల పండుగగా ఉండే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సాయి దుర్గాతేజ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తదితరులు రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెట్టారు.

Updated Date - Mar 28 , 2025 | 02:29 AM