గుర్తుండిపోయే పాత్ర
ABN, Publish Date - Mar 05 , 2025 | 06:43 AM
‘నేను పరిశ్రమకు వచ్చి 48 ఏళ్లు అయింది. ‘రాబిన్ హుడ్’ లాంటి కథాబలమున్న చిత్రంలో అవకాశం దక్కడం అరుదు. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది’ అన్నారు...
‘నేను పరిశ్రమకు వచ్చి 48 ఏళ్లు అయింది. ‘రాబిన్ హుడ్’ లాంటి కథాబలమున్న చిత్రంలో అవకాశం దక్కడం అరుదు. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది’ అన్నారు రాజేంద్రప్రసాద్. నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్’లో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ‘సినిమాలో నితిన్ నా టైమింగ్ ఫాలో అవ్వాలి. నేను అతని టైమింగ్ ఫాలో అవ్వాలి. మా ఇద్దరి క్యారెక్టర్స్ అలా డిజైన్ చేశారు. ఇలాంటి వినోదాత్మక చిత్రం చేసి చాలా కాలమైంది. దర్శకుడు వెంకీ స్పెషల్‌గా నా కోసం రాసుకున్న పాత్ర ఇది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి, ‘నాన్నకు ప్రేమతో’, ‘శ్రీమంతుడు’, ‘ఓ బేబీ, ’ఎఫ్ 2’ చిత్రాల తరహాలో ‘రాబిన్‌హుడ్’లోనూ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నా పాత్ర ఉంటుంది’ అన్నారు.