వినోదాలు పంచేందుకు సిద్ధం
ABN, Publish Date - Mar 18 , 2025 | 02:41 AM
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు....
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 18న సినిమాను విడుదల చేస్తునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘‘వేసవిలో వినోదాలు పంచేందుకు మా చిత్రం సిద్ధమైంది. ఇంటిల్లిపాదీ కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అని చెప్పారు. తనికెళ్ల భరణి, నరేశ్ విజయకృష్ణ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేశ్, డీఓపీ: పీజీ.విందా, సంగీతం: వివేక్‌సాగర్.