లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశం ఇది

ABN, Publish Date - Apr 10 , 2025 | 02:39 AM

ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ బుఽధవారం మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు. ‘యాంకర్‌ నుంచి నటుడిగా...

ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ బుఽధవారం మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు. ‘యాంకర్‌ నుంచి నటుడిగా మారడం చాలా లక్కీగా ఫీల్‌ అవుతున్నాను. ఇప్పుడు నా పై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశం ఇది’ అని చెప్పారాయన. హీరోగా తన రెండో సినిమా గురించి మాట్లాడుతూ ‘తొలి సినిమా తర్వాత మంచి కంటెంట్‌తో మరో సినిమా చేయాలని ప్లాన్‌ చేశాం. ఆసక్తి, ఫ్యాషన్‌ ఉన్న వాళ్లందరం కలసి ఈ సినిమా చేశాం. మంచి కథ దొరకడానికి ఇంత కాలం పట్టింది’ అని వివరించారు. సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ ‘ఇందులో కృష్ణ అనే పాత్ర పోషించాను. సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ప్రేక్షకులు అంత ఎంటర్‌టైన్‌ అవుతారు. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్‌లో హ్యాపీగా చూసే సినిమా ఇది. పవన్‌కల్యాణ్‌ తొలి సినిమా టైటిల్‌తో ఈ చిత్రం చేయడం మాపై బాధ్యతను మరింత పెంచింది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా తీశాం. మా కథకు సరిపోయే టైటిల్‌ ఇది. దర్శకులు నితిన్‌, భరత్‌ నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్‌ వారికి తెలుసు. దానికి తగ్గట్లుగా ఈ కథను అందంగా తెరపై మలిచారు’ అని చెప్పారు.

Updated Date - Apr 10 , 2025 | 02:39 AM