Jack: మోత మోగించలేక పోయిన టిల్లు!

ABN, Publish Date - Apr 11 , 2025 | 06:56 PM

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న సిద్థు జొన్నలగడ్డ 'జాక్' అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవన్నది ట్రేడ్ వర్గాల కథనం.

'డీజే టిల్లు'... చిన్న సినిమాగా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో తీన్మార్ మోగించిన మూవీ! అప్పటిదాకా పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేని సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) డీజే మోతతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ కంటే ముందు కొన్ని సినిమాలు చేసినా... అవి పెద్దగా సక్సెస్ కాలేదు మనోడికి అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ 'డీజే టీల్లు' మాత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాదు అనేక అవకాశాలనూ తెచ్చిపెట్టింది. టిల్లుగాడిగా మనోడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకోవడంతో పాటు యూత్ కు తెగ కనెక్ట్ అయిపోయాడు. ఇటు మేకర్స్ సైతం సిద్దుతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.


అలా టిల్లు ఫ్రాంచైజీతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ''డీజే టిల్లు, టిల్లు స్క్వేర్''తో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. త్వరలో దీని మూడో పార్ట్ కూడా రాబోతోంది. ఈ గ్యాప్‌లో సిద్దూ రెండు సినిమాలు సైన్ చేశాడు. అవే జాక్ (Jack ), తెలుసు కదా (Telusu Kada)! 'బొమ్మరిల్లు' భాస్కర్ (Bommarillu Bhaskar) డైరెక్ట్ చేసిన 'జాక్' తాజాగా రిలీజ్ కాగా అది అందరినీ షాక్‌కు గురి చేసింది


సిద్దు ఇమేజ్ తో థియేటర్లకు వెళ్లిన ఆడియెన్స్ 'జాక్' చూసి డీలా పడ్డారు. చిత్రం ఏమంటే... తెలుగు రాష్ట్రాల్లో జాక్ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఓవర్సీస్‌లో కూడా అదే పరిస్థితి. 'టిల్లు స్క్వేర్' ఫస్ట్ డే ఓపెనింగ్స్‌తో పోలిస్తే, 'జాక్' కేవలం 10 శాతం మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది సిద్దూకి ఓ భారీ కుదుపు అనే చెప్పాలి. 'బొమ్మరిల్లు' భాస్కర్ డైరెక్షన్... 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించడం... ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మించడం... ఇవేవీ కూడా సిద్ధు మూవీని సేవ్ చేయలేకపోయాయి. మౌత్ టాక్ కూడా పెద్దగా వినిపించ‌డం లేదు. చూసి వారు సైతం నెగెటివ్ రిపోర్టే ఇస్తున్నారు. దీంతో షోస్ కూడా ఏ మాత్రం పుంజుకోవ‌డం లేదు. చూస్తుంటే 'జాక్' రిజ‌ల్ట్ డిజాస్టర్ ట్యాగ్‌తో ముగిసేలా కనిపిస్తోంది. దీంతో సిద్దూ ఆశలన్నీ త్వరలో రాబోతున్న 'తెలుసు కదా' మీదేనే ఉన్నాయి. ఈ సినిమాతో నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మరి ఆమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి!?

Also Read: 23 Movie: అనన్య ఆవిష్కరించిన పాట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 11 , 2025 | 06:56 PM