మంచి కంటెంట్‌ ఉంటేనే సినిమా చూస్తున్నారు

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:06 AM

‘పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తొలి ప్రేమ’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్‌ చేసినప్పుడు ఐదేళ్లు సినిమా హక్కులు మా దగ్గర ఉండేవి. ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు రీ రిలీజ్‌ చేస్తే...

‘పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తొలి ప్రేమ’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్‌ చేసినప్పుడు ఐదేళ్లు సినిమా హక్కులు మా దగ్గర ఉండేవి. ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు రీ రిలీజ్‌ చేస్తే మంచి అమౌంట్‌ వచ్చేది. నిజంగా అవన్నీ మిరాకిల్‌ డేస్‌. అలాగే ఇప్పుడు కూడా రీ రిలీజ్‌కు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు’ అన్నారు దిల్‌ రాజు. వెంకటేశ్‌, మహేశ్‌ నటించిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఈ నెల 7న మళ్లీ విడుదల చేస్తున్న సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఈ సినిమా ఓటీటీలో ఉంది. చాలా మంది చూసేశారు. అయినా ఇప్పుడు మళ్లీ థియేటర్లకు చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారంటే కారణం .. మంచి కంటెంట్‌. ఇప్పటికే పది థియేటర్లు ఫుల్‌ అయ్యాయి. మంచి సినిమాలు తీస్తే జనం మళ్లీ మళ్లీ థియేటర్‌కు వస్తారని రీ రిలీజులు నిరూపిస్తున్నాయి. పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ జనంతో పాటు థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలని ఉంది. అందుకే ఆ రోజు సుదర్శన్‌ లో మార్నింగ్‌ షో చూస్తా’ అని చెప్పారు.

Updated Date - Mar 06 , 2025 | 05:06 AM