మా స్కూటర్‌కి అన్నీ తెలుసు
ABN, Publish Date - Mar 18 , 2025 | 02:38 AM
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం...
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్’. రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి నిర్మాతలు. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుప్రీత్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు కలిగిన ఆలోచనే ఈ చిత్రం. వాహనానికి లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది. పిల్లల దగ్గరికి టుక్ టుక్ ఎలా వచ్చింది? ఆ వాహనం వెనుక కథ ఏమిటి అనేది ఆసక్తికరంగా చెప్పాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. చిత్తూరు నేపథ్యంలో 90 నుంచి 20వ దశకం మధ్య జరిగే స్టోరీ ఇది. గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ తెలిసిన స్కూటర్ కథ. మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగా కుదిరాయి’ అని తెలిపారు.