మహిళల సమస్యలపై..
ABN, Publish Date - Mar 20 , 2025 | 02:28 AM
షెరాజ్ మెహదీ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్దే, కృతి వర్మ కథానాయికలు. సురీందర్ కౌర్ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల...
షెరాజ్ మెహదీ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్దే, కృతి వర్మ కథానాయికలు. సురీందర్ కౌర్ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘‘ఇది చిన్న చిత్రమైనా.. పెద్ద విజయం సాధిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది’’ అని చెప్పారు. హీరోయిన్ కృతి వర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ వినగానే గూస్‌బంప్స్ వచ్చాయి’’ అని చెప్పారు. హీరోయిన్ విహాన్షీ హెగ్దే మాట్లాడుతూ ‘‘మహిళల సమస్యలపై తీసిన చిత్రమిది’’ అని తెలిపారు.