ఈ సమ్మర్ బ్లాక్‌బస్టర్ ఇదే
ABN, Publish Date - Apr 16 , 2025 | 04:03 AM
తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2’. 2022లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు నిర్మించారు....
తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2’. 2022లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్‌నంది కథను అందించి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శర్వానంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనే నమ్మకముంది. ఈ సమ్మర్ బ్లాక్‌బస్టర్ ఇదే అవుతుందనిపిస్తోంది’’ అని అన్నారు. ‘‘ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చే చిత్రమిది’’ అని సంపత్ నంది చెప్పారు. ‘‘ఇందులో నేను పోషించిన పాత్ర నా కెరీర్లోనే ప్రత్యేకమైనది’’ అని తమన్నా భాటియా తెలిపారు. ‘‘మంచికీ చెడుకూ మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది’’ అని మధు అన్నారు. ‘‘మునుపెన్నడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి’’ అని అశోక్‌తేజ చెప్పారు.