కడుపుబ్బా నవ్వించే చిత్రం

ABN, Publish Date - Apr 13 , 2025 | 01:40 AM

నూతన నటుడు పవన్‌కల్యాణ్‌ తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘పురుష’. ఈ సినిమాను వీరు ఉలవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు...

నూతన నటుడు పవన్‌కల్యాణ్‌ తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘పురుష’. ఈ సినిమాను వీరు ఉలవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాను ప్రారంభించారు. ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ ఫేమ్‌, దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 01:40 AM