వందేళ్ల నాటి భవనానికి ఆధునిక హంగులు
ABN, Publish Date - Mar 12 , 2025 | 05:36 AM
సీనియర్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ స్వగ్రామంలో గృహ ప్రవేశం చేశారు. ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో ఆయన తాతగారు 1925లో...
సీనియర్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ స్వగ్రామంలో గృహ ప్రవేశం చేశారు. ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో ఆయన తాతగారు 1925లో నిర్మించిన భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఇటీవల చాటపర్రు వచ్చిన మురళీమోహన్, తాతల నాటి ఇంటి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పునర్‌నిర్మాణం చేపట్టారు. పాత భవనం రూపురేఖలను మార్చకుండా.. మరో 50 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేలా కోట్లు వెచ్చించి కొత్త భవనాన్ని నిర్మించారు. కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు మాజీ ఎంపీ మాగంటిబాబు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఏలూరు రూరల్ (ఆంధ్రజ్యోతి)