Janasena: డల్లాస్ జనసైన్యం ఆధ్వర్యంలో విశాఖ ఎమ్మెల్యే, నిర్మాత వంశీ కృష్ణ యాదవ్ కు సన్మానం 

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:03 AM

డల్లాస్ జనసైన్యం సభ్యుల ఆధ్వర్యంలో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి ది మెరిడియన్ వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది.

డల్లాస్ జనసైన్యం సభ్యుల ఆధ్వర్యంలో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి ది మెరిడియన్ వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన సమర్థకులు, జనసేన వీరమహిళలు, జనసైనికులు, టీడీపీ-బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ప్రధాని మోదీ జీ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో సఫల చర్చలు జరిగాయి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని,

ఇందులో ఎటువంటి సందేహం లేదని వంశీ గారు అన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అరాచకం నుంచి ప్రజలు విముక్తి పొంది, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వంశీ గారు విశాఖపట్నం ప్రాముఖ్యతను, అక్కడి పారిశ్రామిక వృద్ధిని గుర్తించి, పెట్టుబడి అవకాశాల కోసం ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీ రాజ్ గ్రామీణ విభాగంలో జరుగుతున్న అభూతపూర్వ అభివృద్ధి పనులను కూడా ఆయన హైలైట్ చేశారు. జనసైనికులు ఎమ్మెల్యే గారితో సంభాషించి, పలు ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే వంశీ కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని డల్లాస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.  

Updated Date - Apr 08 , 2025 | 12:03 AM