మీమ్స్‌... రీల్స్‌

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:38 AM

సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం మ్యాడ్‌ స్క్వేర్‌. విజయవంతమైన మ్యాడ్‌ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది...

సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. విజయవంతమైన ‘మ్యాడ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం మరో గీతాన్ని విడుదల చేసింది. ‘ఏసుకోండ్రా మీమ్స్‌... చేసుకోండ్రా రీల్స్‌’ అంటూ సాగే ఈ హుషారైన గీతానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతంతో పాటు స్వరాన్నందించారు. అనుదీప్‌ కె.వి రచించారు. ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్‌, మురళీధర్‌ గౌడ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారికా సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 02:38 AM