మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
ABN, Publish Date - Apr 09 , 2025 | 04:42 AM
మంచు కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లోలేని సమయంలో...
మంచు కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లోలేని సమయంలో కారుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడని, జల్‌పల్లి ఇంట్లో సైతం 150 మంది చొరబడి విధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 1న పాప పుట్టిన రోజు వేడుకల కోసం జైపూర్ వెళ్లాను. విష్ణుతో పాటు 150 మంది ఇంట్లోకి వచ్చారు. నా గదులను ధ్వంసం చేశారు. నగల పెట్టెలను సైతం ధ్వంసం చేశారు’ అని తెలిపారు. కాగా, నార్సింగిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్న ముప్పా విల్లా్‌సలో జరిగిన దొంగతనం సంఘటనపై ఆయన డ్రైవర్ సాంబశివరావు ఫిర్యాదు చేశారని నార్సింగి పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ సిటీ/నార్సింగి (ఆంధ్ర జ్యోతి)