అమెరికాలో కన్నప్ప ప్రచారం

ABN, Publish Date - Apr 29 , 2025 | 04:14 AM

‘కన్నప్ప’ చిత్రం కోసం అమెరికాలో వరుస ప్రమోషన్స్‌ చేయనున్నారు మంచు విష్ణు. ఇందులో భాగంగా మే నెల 8 నుంచి అమెరికాలో పలు ప్రచార కార్యక్రమాలు...

‘కన్నప్ప’ చిత్రం కోసం అమెరికాలో వరుస ప్రమోషన్స్‌ చేయనున్నారు మంచు విష్ణు. ఇందులో భాగంగా మే నెల 8 నుంచి అమెరికాలో పలు ప్రచార కార్యక్రమాలు, రోడ్‌ షోలను ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు న్యూజెర్సీ, డల్లాస్‌, లాస్‌ ఏంజిల్స్‌లో ఇవి జరగనున్నాయి. ఈ ప్రచారంలో చిత్రబృందం పాల్గొననుంది. జూన్‌ 27న సినిమా విడుదల కానుంది. కాగా, మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో ముఖేష్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.

Updated Date - Apr 29 , 2025 | 04:14 AM