డ్రగ్స్‌ కేసులో మలయాళ దర్శకుల అరెస్టు

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:41 AM

ఇటీవలె మలయాళ నటుడు షైన్‌ టామ్‌చాకోను డ్రగ్స్‌ తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. ‘నేనొక్కడినే కాదు, మలయాళ పరిశ్రమలో...

ఇటీవలె మలయాళ నటుడు షైన్‌ టామ్‌చాకోను డ్రగ్స్‌ తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. ‘నేనొక్కడినే కాదు, మలయాళ పరిశ్రమలో చాలా మంది మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు’ అని ఆయన చేసిన వాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా, మలయాళ పరిశ్రమకు చెందిన ఇద్దరు దర్శకులను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేశారు. ‘జింఖానా’ ఫేమ్‌ ఖలీద్‌ రెహ్మాన్‌, ‘తమాషా’ ఫేమ్‌ అష్రఫ్‌ హంజాలతో పాటు వారి స్నేహితుడు షలీఫ్‌ మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం కొచ్చిలోని ఓ అపార్టుమెంటులో సోదాలు నిర్వహించిన పోలీసులు వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. వారు ముగ్గురూ కొంతకాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది.

Updated Date - Apr 28 , 2025 | 12:41 AM