మహేశ్ లుక్ లీక్
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:02 AM
ఎస్.ఎ్‌స.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం...
ఎస్.ఎ్‌స.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకి రాకుండా మేకర్స్ జాగ్రత్తపడుతున్నారు. హైదరాబాద్, ఒడిసా షెడ్యూల్స్ పూర్తిచేసిన చిత్రబృందం మరో షెడ్యూల్ కోసం త్వరలో విదేశాలకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం మహేశ్ లుక్ పరంగా పూర్తిగా మేకోవర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేనంతగా గడ్డం పెంచేశారు. గుబురు గడ్డంలో ఉన్న మహేశ్ బాబు ఫొటోలు లీక్ అయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ చూసిన అభిమానులు సూపర్ అంటూ మురిసిపోతున్నారు. కాగా, దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్టెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.