మధురమైన విజయాన్ని అందుకోవాలి

ABN, Publish Date - Apr 17 , 2025 | 02:26 AM

ఉదయ్‌రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా రాజేశ్‌ చికిలే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురం’. యం.బంగార్రాజు నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా...

ఉదయ్‌రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా రాజేశ్‌ చికిలే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురం’. యం.బంగార్రాజు నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘‘ఈ ‘మధురం’ చిత్రం మధురమైన విజయం సాధించాలి. చిత్రంలో భాగమైన వారందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని చెప్పారు. దర్శకుడు చికిలే మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం టీమ్‌ సమస్టి కృషి. చిత్ర విజయంపై పూర్తి నమ్మకముంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండ, సంగీత దర్శకులు ఆర్‌.పీ.పట్నాయక్‌, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 02:26 AM