మాట నిలబెట్టుకున్నాం

ABN, Publish Date - Apr 13 , 2025 | 01:48 AM

‘ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకూ ప్రేక్షకుల పెదాల మీద నవ్వు ఉంటుందని ప్రామిస్‌ చేశాం. దాన్ని నిలబెట్టుకున్నాం. ఆడియన్స్‌ థియేటర్‌లో నవ్వుతుంటే ఆనందంతో మా కడుపు నిండిపోయింది. మమ్మల్ని...

‘ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకూ ప్రేక్షకుల పెదాల మీద నవ్వు ఉంటుందని ప్రామిస్‌ చేశాం. దాన్ని నిలబెట్టుకున్నాం. ఆడియన్స్‌ థియేటర్‌లో నవ్వుతుంటే ఆనందంతో మా కడుపు నిండిపోయింది. మమ్మల్ని నమ్మి థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌’ అన్నారు ప్రదీప్‌ మాచిరాజు. ఆయన హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రం విడుదలైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. సినిమా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తమ జీవితాల్లో ఇది మరుపురాని రోజు అని పేర్కొన్నారు. మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే వారికి ఆయన ఈ సందర్భంగా థియేటర్‌కు రండంటూ ఆహ్వానం పలికారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకద్వయం నితిన్‌, భరత్‌ కృతజ్ఙతలు తెలిపారు. ‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. మంచి సమ్మర్‌ ఎంటర్‌టైనర్‌. అందరూ ఫ్యామిలీతో థియేటర్‌కు రండి. కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి చెప్పారు.

Updated Date - Apr 13 , 2025 | 01:48 AM