ఎంపురాన్‌కు మరోసారి సెన్సార్
ABN, Publish Date - Apr 02 , 2025 | 05:07 AM
మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్2: ఎంపురాన్’లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైన నేపథ్యంలో...
మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్2: ఎంపురాన్’లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైన నేపథ్యంలో దర్శక నిర్మాతలు మరోసారి సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. చిత్రంలోని 24 సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు చెప్పింది. కొన్ని చోట్ల ఆడియో మ్యూట్ చేయాలని, కొన్ని పేర్లు మార్చాలని ఆదేశించింది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు సినిమాలో కీలక పాత్ర బాల్‌రాజ్ భజరంగీ పేరును బలదేవ్‌గా మార్చనున్నారు. థాంక్స్ కార్డులోని కేంద్ర మంత్రి సురేష్ గోపి పేరునూ తొలగించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు సంబంధించిన సన్నీవేశాలు మ్యూట్‌లో ప్రదర్శితమవుతాయి. అయితే రివైజ్డ్ వెర్షన్‌ను ఎప్పటి నుంచి ప్రదర్శిస్తారనే విషయాన్ని చిత్రబృందం ప్రకటించలేదు.