Twilight Actress Marriage: సహనటితో హాలీవుడ్ హీరోయిన్ పెళ్లి
ABN, Publish Date - Apr 22 , 2025 | 04:20 AM
అమెరికన్ నటి క్రిస్టిన్ స్టీవర్ట్ తన సహనటి డైలాన్ మేయర్‌ను ఆరేళ్ల ప్రేమ అనంతరం వివాహం చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని తమ ఇంట్లో సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది
స్క్రీన్‌ప్లే రచయిత్రి, నటి డైలాన్ మేయర్‌తో ఆరేళ్లుగా రిలేషన్‌లో ఉన్న అమెరికన్ హీరోయిన్, ‘ట్విలైట్’ ఫేమ్ క్రిస్టిన్ స్టీవార్ట్ ఆదివారం నాడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి సమ్మతిస్తూ అక్కడి ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ చేతికందాక వీరి వివాహం జరగడం గమనార్హం. లాస్ ఏంజెల్స్‌లో వీరిద్దరూ ఉంటున్న ఇంట్లోనే జరిగిన ఈ వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. స్టీవర్ట్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందే ఇద్దరితో డేటింగ్ చేసిన ఈ అమెరికన్ నటి 2012లో తనకంటే 19 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు రూబర్ట్ శాండర్స్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాది కాలంలోనే వీరిద్దరూ విడిపోయారు. 2019లో డైలాన్ మేయర్ పరిచయం కావడం, ప్రేమలో పడడం జరిగాయి. 2021లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినా, ప్రభుత్వ పరమైన అనుమతి రాకపోవడంతో పెళ్లి ఆలస్యమైంది.