ఆలయాన్ని రక్షించిన యోధుల కథ

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:56 AM

సునీల్‌శెట్టి, సూరజ్‌ పంచోలి, వివేక్‌ ఒబెరాయ్‌, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో ప్రిన్స్‌ ధిమాన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కేసరివీర్‌’...

సునీల్‌శెట్టి, సూరజ్‌ పంచోలి, వివేక్‌ ఒబెరాయ్‌, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో ప్రిన్స్‌ ధిమాన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కేసరివీర్‌’. చౌహాన్‌ స్టూడియోస్‌, పనోరమ స్టూడియోస్‌ బ్యానర్లపై కను చౌహాన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తుగ్లక్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు హమీర్జీ గోహిల్‌ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. హమీర్జీ గోహిల్‌ పాత్రలో సూరజ్‌ పంచోలి అద్భుతంగా నటించారు. 14వ శతాబ్దంలో ఆక్రమణదారుల నుంచి సోమనాథ్‌ ఆలయాన్ని రక్షించిన యోధుల కథను ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించారు. మరో యోధుడు వేగ్ధాజీ పాత్రలో సునీల్‌శెట్టి నటించగా, జాఫర్‌ ఖాన్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ కనిపించనున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 04:56 AM