Karmani Movie: అందరినీ అలరిస్తుంది
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:54 AM
నాగమహేశ్, రూపాలక్ష్మీ ప్రధాన పాత్రల్లో రమేశ్ దర్శకత్వంలో ‘కర్మణి’ సినిమా ప్రారంభమైంది. విభిన్న కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది
నాగమహేశ్, రూపాలక్ష్మీ ప్రధాన పాత్రల్లో రమేశ్ అనెగౌని తెరకెక్కించనున్న సినిమా ‘కర్మణి’. మంజుల చవన్, రమేశ్ గౌడ్ అనెగౌని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రారంభించారు. సీనియర్ నటుడు నాగమహేశ్ క్లాప్ కొట్టగా, నిర్మాత మంజుల చవన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ మాట్లాడుతూ ‘‘ఇది విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న చిత్రం. అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరామెన్: జగదీష్ కొమరి, సంగీతం: జాన్ భూషన్