యోగిని కలసిన కన్నప్ప టీమ్
ABN, Publish Date - Apr 10 , 2025 | 02:43 AM
‘కన్నప్ప’ చిత్రబృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. వారిని సాదరంగా ఆహ్వానించిన యోగి..
‘కన్నప్ప’ చిత్రబృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. వారిని సాదరంగా ఆహ్వానించిన యోగి.. ఈ సినిమా విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూన్ 27న ‘కన్నప్ప’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖ చిత్రకారుడు రమేశ్ గిరిజాల గీసిన ఓ పెయింటింగ్‌ను డా.మోహన్‌బాబు, విష్ణు, ప్రభుదేవా బహూకరించారు. కాగా, ముఖేశ్‌కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రీతీ ముకుందన్ కథానాయిక. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, కాజల్ ఇందులో నటిస్తున్నారు.