షూటింగ్ పూర్తి
ABN, Publish Date - Mar 10 , 2025 | 04:38 AM
కంగనా రనౌత్, మాధవన్ జంటగా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరూ ప్రధాన పాత్ర ధారులుగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్...
కంగనా రనౌత్, మాధవన్ జంటగా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరూ ప్రధాన పాత్ర ధారులుగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిత్రబృందంతో సెట్‌లో దిగిన ఫొటోలను షేర్ చేశారు. త్వరలోనే టైటిల్‌ను ప్రకటించి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రం తర్వాత కంగన, మాధవన్ కలసి నటించిన చిత్రమిది. అలాగే ‘తలైవి’ చిత్రం తర్వాత మరోసారి ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగన నటించారు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.