కల్యాణ్‌రామ్ నట విశ్వరూపం చూస్తారు
ABN, Publish Date - Apr 10 , 2025 | 02:44 AM
‘కల్యాణ్‌రామ్ విలువలున్న మనిషి. ఎన్టీ రామారావు గారి మనవడు. ఆ క్రమశిక్షణ ఎక్కడికి పోతుంది. అతను చేసే ప్రతి పనిలోనూ ఆ సంస్కారం కనిపిస్తుంది ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రంలో...
‘కల్యాణ్‌రామ్ విలువలున్న మనిషి. ఎన్టీ రామారావు గారి మనవడు. ఆ క్రమశిక్షణ ఎక్కడికి పోతుంది. అతను చేసే ప్రతి పనిలోనూ ఆ సంస్కారం కనిపిస్తుంది ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రంలో ఆయన నట విశ్వరూపం చూస్తారు’ అని నటి విజయశాంతి అన్నారు. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ‘ముచ్చటగా బంధాలే’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి, కల్యాణ్‌రామ్, హీరోయిన్ సాయి మంజ్రేకర్, నిర్మాత అశోక్‌వర్ధన్ ముప్పా తదితరులు పాల్గొన్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘ఈ నెల 12న మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి తమ్ముడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు’ అని చెప్పారు.