కల్కి 2.. సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:49 AM

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం నేటి సమాజంలో ఉన్న పరిస్థితులకూ అద్దం పడుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. మంచి సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు’ అని దర్శకుడు...

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం నేటి సమాజంలో ఉన్న పరిస్థితులకూ అద్దం పడుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. మంచి సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. 2015లో నాని హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ నిర్మించారు. దీనిని ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘కొన్ని సినిమాలపై మమకారం ఎక్కువ ఉంటుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం కూడా అలాంటిదే. ప్రస్తుతం కల్కి-2 స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రభాస్‌ స్ర్కీన్‌ ప్రజెన్స్‌ పార్ట్‌-2లో ఎక్కువగానే ఉంటుంది. పదేళ్ల నా కెరీర్‌ సంతృప్తిగానే ఉంది. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని కొత్త తరహా కాన్సె్‌ప్టతోనే నా సినిమాలు చేస్తున్నాను’ అని అన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 02:49 AM