Kaliyugam Movie: కలియుగంలో పోరాటం

ABN, Publish Date - Apr 26 , 2025 | 02:50 AM

శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన 'కలియుగం 2064' చిత్రం మే 9న విడుదల కానుంది. 2064లో మానవజాతి మనుగడ కోసం జరిగే పోరాటం నేపథ్యంలో సినిమా రూపొందింది

శ్రద్ధా శ్రీనాథ్‌ లీడ్‌రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘కలియుగం 2064’. కిశోర్‌ కీలకపాత్ర పోషించారు. ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ‘కలియుగమ్‌ 2064’ చిత్రాన్ని మే 9న తెలుగు తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మానవజాతి మనుగడ కోసం చేసిన పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది’ అని అన్నారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తోంద ని నిర్మాత తెలిపారు.

Updated Date - Apr 26 , 2025 | 04:11 AM