కొత్త తేదీన జాన్వీ చిత్రం
ABN, Publish Date - Mar 17 , 2025 | 02:28 AM
వరుణ్ ధావన్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి’. ఈ చిత్రం విడుదల తేదీ మారింది....
వరుణ్ ధావన్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి’. ఈ చిత్రం విడుదల తేదీ మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలవ్వాల్సి ఉంది. అయుతే సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాణసంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఆదివారం ప్రకటించింది. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, భావోద్వేగాల మిళితంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్ పేర్కొంది. ‘బవాల్’ తర్వాత వరుణ్, జాన్వీ జంటగా నటిస్తున్న చిత్రమిది. శశాంక్ ఖేతన్ దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ సరాఫ్, సన్యా మల్హోత్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు.