జాన్వీ కపూర్‌కు ఖరీదైన కానుక

ABN, Publish Date - Apr 13 , 2025 | 01:46 AM

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కార్ల కలెక్షన్స్‌లో మరో లగ్జరీ కారు చేరింది. జాన్వీ స్నేహితురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్‌ మంగళం బిర్లా పెద్ద కుమార్తె అనన్య బిర్లా రూ.5 కోట్ల విలువై...

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కార్ల కలెక్షన్స్‌లో మరో లగ్జరీ కారు చేరింది. జాన్వీ స్నేహితురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్‌ మంగళం బిర్లా పెద్ద కుమార్తె అనన్య బిర్లా రూ.5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును కానుకగా ఇచ్చారు. ఈ కారు శుక్రవారం ఉదయం జాన్వీ నివాసానికి చేరుకుంది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కారుతోపాటు మరో గిఫ్ట్‌ ప్యాక్‌ను కూడా అనన్య పంపించారు. దానిపై ‘ప్రేమతో నీ అనన్య’ అని రాసి ఉంది. కాగా, ఇటీవలె అనన్య బ్యూటీ ప్రొడక్ట్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించారు. ఈ బ్రాండ్‌కు జాన్వీ కపూర్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు సమాచారం. తన బ్రాండ్‌ కోసం జాన్వీ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఖరీదైన కారును బహూకరించారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 13 , 2025 | 01:46 AM