ఆస్కార్‌ 2025 బరిలో భారతీయ చిత్రాలు

ABN, Publish Date - Jan 08 , 2025 | 03:01 AM

కంగువ : ‘కంగువ’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండయా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రతిచోటా ప్రేక్షకులను తిరస్కారాన్ని ఎదుర్కొంది. గతేడాది నిర్మాతలకు అత్యధిక న ష్టాలను మిగిల్చిన చిత్రంగా నిలిచింది. వెయ్యేళ్ల క్రితం ఆదిమ తెగల మధ్య జరిగిన యుద్ధాల నేపథ్యంలో ‘కంగువ’ చిత్రం తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించారు. దిశాపటానీ, బాబీడియోల్‌ కీలకపాత్రలు పోషించారు. ‘కంగువ’ ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకోవడానికి కారణం కథాంశం, విజువల్స్‌, సినిమాటోగ్రఫీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆడుజీవితం : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కథానాయకుడిగా నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడుజీవితం’. పలు భారతీయ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. నజీబ్‌ అహ్మద్‌ అనే మలయాళీ స్నేహితుడితో కలసి ఉపాధి కోసం సౌదీకి వెళ్తాడు. ఏజెంట్‌ చేసిన మోసం కారణంగా అక్కడ ఓ కర్కోటకుడైన గొర్రెల యజమాని చేతిలో బందీ అవుతాడు. ఎడారి మధ్యలో సరైన తిండీ, తిప్పలు లేక ఎన్నో అవస్థలు పడతాడు. దారి తెన్నూ తెలియని ఎడారి నుంచి బయట పడేందుకు అతను చేసిన ప్రయత్నాలతో సినిమా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ : స్వత్రంత్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌’. రణ్‌దీప్‌ హుడా దర్శకత్వం వహిస్తూ టైటిల్‌ రోల్‌ పోషించారు. బ్రిటిష్‌ వారిపై పోరాడేందుకు సావర్కర్‌ ఎంచుకున్న పంథా, అండమాన్‌ జైల్లో సుదీర్ఘ కారాగార వాసం చేస్తూ ఆయన అనుభవించిన బాధలు, జైలు నుంచి విడుదలయ్యాక ‘హిందుత్వ’ భావజాలాన్ని సృష్టించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనే అంశాల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కించారు. ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ : పాయల్‌ కపాడియా రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’. ఇద్దరు కేరళ అమ్మాయిలు ఉపాధి కోసం ముంబై నగరానికి వెళ్లి అక్కడ నర్సులుగా పనిచేస్తుంటారు. అక్కడి నగర జీవితంలోని ఇబ్బందులు, నీడ కోసం పేదవారు పడే పాట్లు, మనుషుల మధ్య అనుబంధాల నేపథ్యంలో కథ సాగుతుంది. సంతోష్‌ : హిందీ చిత్రం ‘సంతోష్‌’లో షహనా గోస్వామి ప్రధాన పాత్ర పోషించారు. ఈ రూరల్‌ క్రైమ్‌ డ్రామాకు సంధ్యా సూరి దర్శకత్వం వహించారు. భర్త మరణంతో అతని కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని పొందిన మహిళ పాత్రలో షహనా గోస్వామి నటించారు. ఓ బాలిక మర్డర్‌ కేసును ఛేదించే క్రమంలో గ్రామీణ నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్‌ ఫెస్టివల్‌లో అవార్డు పొందింది. తొలి ప్రయత్నంలోనే ఆస్కార్‌ బరిలో ఆస్కార్‌ నామినేషన్‌ దకి ్కంచుకున్న తొలి బెంగాలీ చిత్రంగా ‘పుతుల్‌’ చరిత్రలో స్థానం దక్కించుకుంది. దర్శక నిర్మాతగా ఇందిరా ధర్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం. అలీ ఫజల్‌, హీరోయిన్‌ రిచా చద్దా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’. మీరా అనే విద్యార్థిని జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ 2025 బరిలో నిలిచే సినిమాల జాబితా వచ్చింది. 97వ అకాడమీ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ను మంగళవారం ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ విడుదల చేసింది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 323 సినిమాలు పోటీ పడగా, 207 సినిమాలు నామినేట్‌ అయ్యాయి. భారతదేశం నుంచి ఆరు భారతీయ చిత్రాలు నామినేషన్స్‌ పొందాయి. తమిళ చిత్రం ‘కంగువ’, మలయాళ చిత్రం ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌), ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ హిందీ చిత్రం ‘స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌’, ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’, బెంగాలీ చిత్రం ‘పుతుల్‌’ నామినేట్‌ అయ్యాయి. భారతీయ నేపథ్యం ఉన్న ‘సంతోష్‌’ చిత్రం యూకే నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో నామినేషన్‌ దక్కించుకొంది. ఈ చిత్రాలకు ఈ నెల 8 నుంచి 12వరకూ ఓటింగ్‌ జరగనుంది. జనవరి 17న తుది జాబితాను అకాడమీ ప్రకటిస్తుంది. మార్చి 2న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.


కంగువ : ‘కంగువ’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండయా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రతిచోటా ప్రేక్షకులను తిరస్కారాన్ని ఎదుర్కొంది. గతేడాది నిర్మాతలకు అత్యధిక న ష్టాలను మిగిల్చిన చిత్రంగా నిలిచింది. వెయ్యేళ్ల క్రితం ఆదిమ తెగల మధ్య జరిగిన యుద్ధాల నేపథ్యంలో ‘కంగువ’ చిత్రం తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించారు. దిశాపటానీ, బాబీడియోల్‌ కీలకపాత్రలు పోషించారు. ‘కంగువ’ ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకోవడానికి కారణం కథాంశం, విజువల్స్‌, సినిమాటోగ్రఫీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆడుజీవితం : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కథానాయకుడిగా నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడుజీవితం’. పలు భారతీయ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. నజీబ్‌ అహ్మద్‌ అనే మలయాళీ స్నేహితుడితో కలసి ఉపాధి కోసం సౌదీకి వెళ్తాడు. ఏజెంట్‌ చేసిన మోసం కారణంగా అక్కడ ఓ కర్కోటకుడైన గొర్రెల యజమాని చేతిలో బందీ అవుతాడు. ఎడారి మధ్యలో సరైన తిండీ, తిప్పలు లేక ఎన్నో అవస్థలు పడతాడు. దారి తెన్నూ తెలియని ఎడారి నుంచి బయట పడేందుకు అతను చేసిన ప్రయత్నాలతో సినిమా ఉత్కంఠ భరితంగా ఉంటుంది.


స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ : స్వత్రంత్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌’. రణ్‌దీప్‌ హుడా దర్శకత్వం వహిస్తూ టైటిల్‌ రోల్‌ పోషించారు. బ్రిటిష్‌ వారిపై పోరాడేందుకు సావర్కర్‌ ఎంచుకున్న పంథా, అండమాన్‌ జైల్లో సుదీర్ఘ కారాగార వాసం చేస్తూ ఆయన అనుభవించిన బాధలు, జైలు నుంచి విడుదలయ్యాక ‘హిందుత్వ’ భావజాలాన్ని సృష్టించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనే అంశాల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కించారు.

ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ : పాయల్‌ కపాడియా రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’. ఇద్దరు కేరళ అమ్మాయిలు ఉపాధి కోసం ముంబై నగరానికి వెళ్లి అక్కడ నర్సులుగా పనిచేస్తుంటారు. అక్కడి నగర జీవితంలోని ఇబ్బందులు, నీడ కోసం పేదవారు పడే పాట్లు, మనుషుల మధ్య అనుబంధాల నేపథ్యంలో కథ సాగుతుంది.


సంతోష్‌ : హిందీ చిత్రం ‘సంతోష్‌’లో షహనా గోస్వామి ప్రధాన పాత్ర పోషించారు. ఈ రూరల్‌ క్రైమ్‌ డ్రామాకు సంధ్యా సూరి దర్శకత్వం వహించారు. భర్త మరణంతో అతని కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని పొందిన మహిళ పాత్రలో షహనా గోస్వామి నటించారు. ఓ బాలిక మర్డర్‌ కేసును ఛేదించే క్రమంలో గ్రామీణ నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్‌ ఫెస్టివల్‌లో అవార్డు పొందింది.

తొలి ప్రయత్నంలోనే ఆస్కార్‌ బరిలో

ఆస్కార్‌ నామినేషన్‌ దకి ్కంచుకున్న తొలి బెంగాలీ చిత్రంగా ‘పుతుల్‌’ చరిత్రలో స్థానం దక్కించుకుంది. దర్శక నిర్మాతగా ఇందిరా ధర్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం. అలీ ఫజల్‌, హీరోయిన్‌ రిచా చద్దా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’. మీరా అనే విద్యార్థిని జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

Updated Date - Jan 08 , 2025 | 03:01 AM