జపాన్‌ అకాడమీ అవార్డు రేసులో...

ABN, Publish Date - Jan 29 , 2025 | 01:42 AM

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ సతీమణి కిరణ్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘లాపతా లేడీస్‌’. జపాన్‌లో అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ఇటీవలే అక్కడ 100 రోజులను పూర్తి చేసుకుంది...

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ సతీమణి కిరణ్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘లాపతా లేడీస్‌’. జపాన్‌లో అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ఇటీవలే అక్కడ 100 రోజులను పూర్తి చేసుకుంది. తాజాగా, ఈ సినిమా ‘జపాన్‌ అకాడమీ ఫిల్మ్‌ ప్రైజ్‌ 2024’ అవార్డులకుగానూ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ విభాగంలో షార్టు లిస్టు అయ్యింది. ఈ జాబితాలో మొత్తం ఐదు చిత్రాలు ఉన్నాయి. ఇందులో క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ‘ఓపెన్‌హైమర్‌’.. యోర్గోస్‌ లాంథిమోస్‌ తెరకెక్కించిన ‘పూర్‌ థింగ్స్‌’తో పాటు ‘ద జోన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’, ‘సివిల్‌ వార్‌’ చిత్రాలు ఉన్నాయి. మార్చి 14న జరిగే వేడుకలో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా, ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ‘లాపతా లేడీస్‌’ ప్రదర్శితమై చక్కటి ఆదరణ పొందింది. ఈ ఏడాది భారత్‌ తరపున ఆస్కార్‌కి ఎంపికైనా, కమిటీ తయారుచేసిన షార్టులిస్టులో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయింది.


Also Read- Coldplay: 'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో మార్మోగిన తెలంగాణ పేరు

Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

Also Read-Baapu Teaser: 'బలగం' లాంటి మరో కథ.. బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 01:42 AM