అతీంద్రియ శక్తుల నేపథ్యంలో
ABN, Publish Date - Mar 19 , 2025 | 02:39 AM
సుశాంత్ కథానాయకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో సంజీవని క్రియేషన్స్ బేనర్‌పై వరుణ్‌కుమార్ రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు..
సుశాంత్ కథానాయకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో సంజీవని క్రియేషన్స్ బేనర్‌పై వరుణ్‌కుమార్, రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. మంగళవారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. సుశాంత్ విభిన్నమైన లుక్‌లో ఆకట్టుకున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే చిత్రమిదని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. అనిరుఽధ్ కృష్ణమూర్తి స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: వైవీబీ శివసాగర్.