అట్టహాసంగా ఐఫా వేడుకలు
ABN, Publish Date - Mar 09 , 2025 | 03:45 AM
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) సిల్వర్ జూబ్లీ వేడుకలు జైపూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో...
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) సిల్వర్ జూబ్లీ వేడుకలు జైపూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, కృతీ సనన్ తదితరులు జైపూర్ చేరుకున్నారు. నటుడు కార్తీక్ ఆర్యన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘జబ్ వియ్ మెట్’ జంట షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఈ మాజీ ప్రేమికులిద్దరూ వేదికపై ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నేడు ఐఫా అవార్డులను విజేతలకు ప్రదానం చేస్తారు. బాలీవుడ్ ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘షోలే’ విడుదలై 50 ఏళ్లు అయిన సందర్భంగా ప్రీమియర్ షో ప్రదర్శించి అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలతో పాటు చిత్రబృందాన్ని ఘనంగా సన్మానించనున్నారు.
Also Read: Radhika Apte: మెగా ఫోన్ పడుతున్న వివాదాస్పద నటి
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి