HanuMan: హిందీ మూవీకి గౌర హరి సంగీతం

ABN, Publish Date - Mar 14 , 2025 | 02:04 PM

హనుమాన్ చిత్రంతో సంగీత దర్శకుడు గౌర హరికి చక్కని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అతను 'మిరాయ్'తో పాటు పలు తెలుగు సినిమాలకు, ఓ హిందీ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

యువ సంగీత దర్శకుడు గౌర హరి (Gowra Hari) కి 'హనుమాన్' (HanuMan) చిత్రం బ్రేక్ ఇచ్చింది. దానికి ముందు కొన్నితెలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపు పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'తో దక్కింది. ఈ సినిమా విజయంలో గౌర హరి పాత్ర కూడా ప్రధానమైంది. ఆ సినిమా పాటలు ఛాట్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో గౌర హరి ఖాతాలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ వచ్చి చేరాయి.


మార్చి 14న గౌర హరి పుట్టిన రోజు సందర్భంగా తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి అతను చెప్పారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మిరాయి' (Mirai) కి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. అలానే అశ్విన్ బాబు మూవీ, సూర్యా పేట జంక్షన్ చిత్రంకు సంగీతం అందిస్తున్నారు. వీటితో పాటే బాలీవుడ్ (Bollywood) మూవీకీ గౌరహరి మ్యూజిక్ ఇస్తున్నారట. ఈ ఇయర్ తనకు సమ్ థింగ్ స్పెషల్ అని చెబుతున్నాడు గౌరహరి. అతి త్వరలోనే మరిన్ని క్రేజీ మూవీస్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తానంటున్నాడు.

Also Read: Dil Ruba Review: కిరణ్‌ అబ్బవరం క హిట్‌ కొనసాగించాడా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 02:04 PM