ఎన్టీఆర్‌.. నీల్‌ విడుదల తేదీ వచ్చేసింది

ABN, Publish Date - Apr 30 , 2025 | 05:00 AM

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ నీల్‌’ ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌. ఇటీవలె, ఈ సినిమా షూట్‌లోకి....

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ నీల్‌’ ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌. ఇటీవలె, ఈ సినిమా షూట్‌లోకి ఎన్టీఆర్‌ అడుగుపెట్టారు. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారింది. కొత్త తేదీని మేకర్స్‌ మంగళవారం ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ కథానాయిక. మైత్రీ మూవీమేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పోషించే పాత్ర మునుపెన్నడూ చూడనంత శక్తిమంతంగా ఉంటుందని మేకర్స్‌ పేర్కొన్నారు. మే20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 30 , 2025 | 05:00 AM