తెలుగులోనూ అద్భుతమైన స్పందన
ABN, Publish Date - Mar 09 , 2025 | 03:47 AM
‘ఒక చరిత్రను సినిమాగా తీయడం అంత తేలికైన విషయం కాదు. అందుకే ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు లక్ష్మణ్‌కు ధన్యవాదాలు’ అన్నారు నిర్మాత బన్నీవాసు. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’...
‘ఒక చరిత్రను సినిమాగా తీయడం అంత తేలికైన విషయం కాదు. అందుకే ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు లక్ష్మణ్‌కు ధన్యవాదాలు’ అన్నారు నిర్మాత బన్నీవాసు. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో విడుదల చేసింది. మంచి ఆదరణ దక్కుతున్న సందర్భంగా యూనిట్ శనివారం థాంక్స్ మీట్‌ను నిర్వహించింది. బన్నీ వాసు మాట్లాడుతూ ‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేసినందుకు గర్వంగా ఉంది. మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చిన దినేశ్‌కు కృతజ్ఞతలు. తెలుగులోనూ ‘ఛావా’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది పిల్లలకు చూపించాల్సిన సినిమా. ఇది కేవలం సినిమా కాదు.. ఒక ఎమోషన్. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛనీ, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఆ రోజు శంభాజీ మహారాజ్ వంటి మహావీరుల త్యాగ ఫలితమే. మా టీమ్ చాలా బాగా పని చేసింది. రె హమాన్ గారు ఎంతో బిజీగా ఉన్నా నాలుగు రోజుల్లో పాటలు పూర్తి చేశారు’ అని చెప్పారు.
తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ మాట్లాడుతూ ‘ఒక సినిమాలా కాకుండా ఎంతో ఎమోషనల్‌గా ఫీలయి, అందరూ పని చేశారు. నాలుగే రోజుల్లో డే అండ్ నైట్ వర్క్ చేసి అద్భుతమైన క్వాలిటీతో డబ్బింగ్ పూర్తి చేశాం’ అని చెప్పారు. సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నటుడు వినీత్‌కుమార్ సింగ్, పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన బన్నీ వాసుకి గీత రచయిత శ్రీమణి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Radhika Apte: మెగా ఫోన్ పడుతున్న వివాదాస్పద నటి
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి