అన్ని వర్గాలనూ అలరిస్తుంది

ABN, Publish Date - Mar 17 , 2025 | 02:30 AM

సుశాంత్‌, జాన్యజోషి, విధి నటించిన హిందీ చిత్రం ‘పింటూ కి పప్పీ’. ఈనెల 21న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా పలు భాషల్లో విడుదలవుతోంది. శివ్‌ హరే దర్శకత్వంలో విధి ఆచార్య నిర్మించారు...

సుశాంత్‌, జాన్యజోషి, విధి నటించిన హిందీ చిత్రం ‘పింటూ కి పప్పీ’. ఈనెల 21న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా పలు భాషల్లో విడుదలవుతోంది. శివ్‌ హరే దర్శకత్వంలో విధి ఆచార్య నిర్మించారు. తెలుగులో ‘కిస్‌ కిస్‌ కిస్సిక్‌’ పేరుతో విడుదలవుతోంది. మురళీశర్మ, గణేశ్‌ ఆచార్య, విజయ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ ‘‘సినిమా రషెస్‌ చూశాను. చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలున్నాయి. తొమ్మిది పాటలూ అద్భుతంగా ఉన్నాయి. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. గణేశ్‌ ఆచార్య మాట్లాడుతూ ‘‘అందమైన కాన్సె్‌ప్టతో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌నూ ఆకట్టుకుంటుంది. సినిమా విజయంపై నమ్మకం ఉంది’’ అని చెప్పారు. హీరో సుశాంత్‌ మాట్లాడుతూ ‘‘సినిమా మంచి కమర్షియల్‌ ప్యాకేజీలా ఉంటుంది’’ అని తెలిపారు.

Updated Date - Mar 17 , 2025 | 02:30 AM